క్యాసినోకి వెళ్తుంటా.. పేకాట ఆడతా ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి

క్యాసినో, మనీ లాండరింగ్ లతో వార్తల్లో నిలిచిన చికోటి ప్రవీణ్ బాగోతాలు ఒక్కోటిగా భయపడుతున్నాయి. ఈ తరుణంలో ప్రవీణ్ తో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అవుతూ పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో సదరు నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

ఇప్పటికే కొడాలి నాని స్పందించగా..తాజాగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. చీకోటీ ప్రవీణ్‌ ఎవరో తనకు తెలియదని.. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాను అప్పుడప్పుడు క్యాసినోలకు వెళ్లి పేకాట ఆడుతుంటానని ఒప్పుకున్న బాలినేని.. ప్రవీణ్‌తో గానీ, అతడు చేసే హవాలా స్కామ్‌లతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తప్పు చేస్తే తప్పని ఒప్పుకునే ధైర్యం తనకుందని.. కానీ చేయని తప్పుకు తనపై ఆరోపణలు చేస్తుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.

SHARE