పార్టీ మారడం ఫై వైసీపీ మాజీ మంత్రి బాలినేని క్లారిటీ

జనసేన పార్టీ లో చేరబోతున్నారనే వార్తలపై వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. జనసేన లో చేరబోతున్నట్లు ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. తనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని… ఎన్ని కష్టాలు వచ్చినా తాను జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా తాను జగన్ వెంటే ఉంటానని అన్నారు.

వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా జగన్ తనకు 22 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారని… ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో సమన్వయం కోసం తాను పని చేస్తున్నానని… ఇందులో భాగంగానే గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నేతలతో నిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశానని బాలినేని చెప్పారు. తాను ఊసరవెల్లి రాజకీయాలు చేయనని తెలిపారు.

చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే… తాను మద్దతు ప్రకటించానని చెప్పారు. చేనేత కార్మికుల కోసం గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలను చేశామని… ఇప్పుడు కూడా చేస్తామని తెలిపారు. మరి ఈ క్లారిటీ తో జనసేన లోకి చేరబోతారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

SHARE