గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం ఫై చంద్రబాబు ఫైర్

వైసీపీ పార్టీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో న్యూడ్‌ గా వీడియో కాల్‌ మాట్లాడిన వీడియో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపట్ల యావత్ రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ..ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యవహారం ఫై సీరియస్ అయ్యారు.

“ఓ వెధవ పనిచేసి ఎవ్వరూ బహిరంగంగా తిరగలేరు.. కానీ సిగ్గులేని వాళ్లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారు” అని మండిపడ్డారు. ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే.. చూస్తూ ఉండాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రిగా ఉన్నవారు.. తప్పు చేసిన వారిని మందలించి, దండిస్తే, మిగిలిన వాళ్లకు భయం ఉంటుందన్న చంద్రబాబు.. జగన్ రెడ్డి ఉదాసీనత వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు భూకబ్జాలు వంటివి పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలే పోలీసుల్ని చంపే పరిస్థితి రాష్ట్రంలో తయారైందని.. సంఘవిద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు.

SHARE