మంత్రి అప్పలరాజు తిరుమలలో హల్​చల్..

ఏపీ మంత్రి అప్పలరాజు తిరుమలలో హల్చల్ చేసారు. తన అనుచరులతో వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఆయన.. భక్తులకు అసౌకర్యం కలిగించారు. తనతో పాటు తన అనుచరులందరికీ ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని టీటీడీ ఫై ఒత్తిడి తెచ్చారు. మంత్రి ఒత్తిడికి తలొగ్గిన టీటీడీ అధికారులు… అనుచరుల్లో 20 మందికి ప్రొటోకాల్‌ దర్శనం కల్పించారు. మరో వందమందికి బ్రేక్‌ దర్శనం కల్పించారు. దీంతో టీటీడీ తీరుపై సామాన్య భక్తులు మండిపడుతున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అప్పలరాజు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గ ప్రజలు 150 మందితో శ్రీవారి దర్శనానికి వచ్చానని… సామాన్య భక్తుడి మాదిరిగా క్యూలైన్‌లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తిరుమలలో ఎక్కడా అధికార హోదా ప్రదర్శించలేదని చెప్పుకొచ్చారు.

SHARE