సీఎం సహాయనిధికి ఏపీఎండీసీ రూ. 5 కోట్ల విరాళం

ఏపీ సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) రూ. 5 కోట్ల విరాళం అంజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , వరదలకు గోదావరి జిలాల్లో తివారి నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) రూ.5 కోట్ల విరాళం అందజేసింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్‌ వీజీ.వెంకటరెడ్డి అందజేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జులై నెలలు భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ లన్ని నిండిపోయాయి. ఇక చెరువులు , వాగులు, వంకలు ఇలా అన్నిపొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ తో పాటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కురవడం తో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద 70 అడుగులే మేర గోదావరి ప్రవహించి ముంపు గ్రామాలతో పాటు పట్టణంలోని పలు కాలనీ లను ముంచేసింది. ఇప్పుడిప్పుడే ఆ వరద ప్రవాహం నుండి మునుపు గ్రామాలూ బయటపడుతున్నాయి. ఈ వర్షాలు , వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల పరిధిలో రూ.1400 కోట్ల నష్టం వాటిల్లిందని టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది.

SHARE