కుప్పం నియోజకవర్గానికి భారీగా నిధులు విడుదల చేసిన జగన్

కుప్పం నియోజకవర్గానికి సీఎం జగన్ భారీగా నిధులు విడుదల చేసారు. రీసెంట్ గా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన జగన్..నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని..నా సొంత నియోజకవర్గం ఎలాగో..కుప్పం నియోజకవర్గం అలాగని తెలుపడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుప్పం మునిసిపాలిటీకి ఏకంగా రూ.66 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది.

ప్రధానంగా మురుగునీటి కాలువలు, తాగునీటి కోసం నూతనంగా బోర్లు, పైప్‌ లైన్లు, సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, అంగన్‌వాడీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, దళవాయి, కొత్తపల్లె చెరువు కట్ట వద్ద పార్కు అభివృద్ధి, చెరువు నుంచి పట్టణానికి నీటి సరఫరా కోసం పైప్‌లైన్ల ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో మొత్తం స్థానాలను కైవసం చేసుకోవాలని వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందుకే ఇప్పటి నుండే టీడీపీకి పట్టున నియోజకవర్గాల ఫై ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది.

SHARE