ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల విడుదల

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. మొత్తం 1లక్ష94వేల752 మంది స్టూడెంట్స్ ఈఏపీ సెట్ రాయగా 1లక్ష 73వేల 572 ఇంజనీరింగ్‌లో అర్హత సాధించారు. వ్యవసాయ విభాగంలో 95పాయింట్3శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89పాయింట్ 12శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

గతంలో ఈఏపీసెట్ ఫలితాల్లో ఇంటర్మీడియట్ మార్కులకు ప్రభుత్వం వెయిటేజీ కల్పించేది. కానీ ఈసారి మాత్రం ఇంటర్ మార్కుల వెయిటేజీ లేదు. కాబట్టి ర్యాంకులన్నీ ఈఏపీసెట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉన్నాయి. ఈ ర్యాంకుల ఆధారంగా నేరుగా కౌన్సిలింగ్ కు హాజరై ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించారు.

SHARE