హోం మంత్రికి సిగ్గు లేదా..? అంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత ఫైర్

వైసీపీ పార్టీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్ వీడియో వ్యవహారం ఫై హోం మంత్రి వనిత స్పందించిన తీరుపై మహిళా అధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేసారు. వీడియో వెనుక రాజకీయ కుట్ర అని హోం మంత్రి ఎలా చెబుతారు..? వెకిలి వేషాలేస్తోన్న ఎంపీపై చర్యలు తీసుకోకుండా ఎంపీని వెనకేసుకు రావడానికి హోం మంత్రికి సిగ్గు లేదా..? అని అనిత నిప్పులు చెరిగారు. హోం మంత్రిగా ఎలా పని చేయాలో తెలియకుంటే ఇంట్లో కూర్చొవాలని ఎద్దేవా చేశారు.

వీడియో వ్యవహారం బయటకు వచ్చిన ఐదు రోజుల తర్వాత హోం మంత్రి బయటకొచ్చి కుట్ర అని మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వస్తే.. అందుబాటులో ఎవ్వరూ లేరన్నారు. పబ్లిక్ హాలిడే కాబట్టి.. పోలీసు ఉన్నతాధికారులు సెలవులో ఉన్నారట అని మండిపడ్డారు. 24 గంటలు పని చేయాల్సిన పోలీసు శాఖ సెలవు తీసుకుంది.రేప్ చేసినా రేపు రండి అనే పరిస్థితి ఏపీ పోలీస్ శాఖలో కన్పిస్తోందన్నారు.

అంత కు ముందు ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. వీడియో మార్ఫింగ్‌ అని ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఫిర్యాదు చేశారు. దీంతో, గోరంట్ల మాధవ్‌ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాము. తప్పు చేస్తే ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటాము. ఇది రాజకీయ కుట్రలా ఉందనే అనుమానాలు ఉన్నాయి. కుట్రకు పాల్పడితే ఎవరినీ వదలేది లేదు. టీడీపీ హయంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరిగాయి. కొందరు పెయిడ్‌ ఆర్టిస్టులు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

SHARE