కార్మికుల గుండెల్లో ఎల్జీ బాలకృష్ణన్ పదిలంగా ఉండిపోతారని వైసీపీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం వెంకటాద్రి గ్రీన్స్ ఆవరణలో బాలకృష్ణన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హిందూపురానికి బాలకృష్ణన్ చేసిన సేవలను కొనియాడారు. కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బందుతున్న సమయంలో బాలకృష్ణన్ పరిశ్రమలు ఏర్పాటు చేసి వేల మందికి ఉపాధి కల్పించారని షేక్ మహమ్మద్ తెలిపారు.ఇంకా చదవండి …

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అనంతపురం నుంచి కర్నూలుకు వెళ్లే పలు ప్యాసింజరు రైళ్లను రద్దు చేసింది. గుతకల్లు-డోన్, డోన-గుత్తి, గుత్తి-డోన, డోన-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ-గుంతకల్లు మధ్య నడిచే రైళ్లను ఈ నెల 24 వరకూ రద్దు చేశారు. జోనల్‌ వ్యాప్తంగా మొత్తం 55 ప్యాసింజరు రైళ్లను నిలిపేశారు. రైళ్లను కొనసాగింపుపై నాలుగు రోజుల తర్వాత తెలియజేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.ఇంకా చదవండి …

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో స్మశాన వాటిక లో హెల్త్ క్లినిక్ నిర్మాణం విషయంలో లో అధికార పార్టీ తీరుపై అఖిలపక్ష నేతలు భగ్గుమంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా హెల్త్ క్లినిక్ నిర్మాణం చేయడాన్ని తప్పుబడుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు బీజేపీ, జనసేన, టిడిపి నాయకులు సమావేశం నిర్వహించారు. హెల్త్ క్లినిక్ నిర్మాణ పనులు జరుగుతున్న స్మశాన వాటిక వద్దకు ర్యాలీగా వెళుతున్న అఖిలపక్షం నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.ఇంకా చదవండి …

అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకలవాండ్లపల్లిలోని టోల్ ప్లాజా సిబ్బందిపై మండల అధ్యక్షుడు అమర్నాథరెడ్డి దురుసుగా ప్రవర్తించాడనే ఆడియో వైరల్ అయింది. పాత సిబ్బంది తొలగింపుపై మాట్లాడేందుకు వెళ్లిన ఆయన విధుల్లో ఉన్నవాళ్లతో వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను అమర్నాథరెడ్డి ఖండించారు. వైరల్ అయిన ఆడియోలో వాస్తవం లేదని చెప్పారు. అయితే.. వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం అందిందని, ఫిర్యాదు మాత్రం రాలేదని నల్లమాడ సీఐ నిరంజన్ రెడ్డిఇంకా చదవండి …