అమరావతి రైతులు మరోమారు భారీ పాదయాత్రకు సిద్దంకాబోతున్నారు

అమరావతి రైతులు మరోమారు రోడ్డెక్కబోతున్నారు. గతేడాది తుళ్లూరు నుంచి తిరుపతికి చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన రావడంతో ఇప్పుడు మరోమారు మహా పాదయాత్రకు రైతులు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పునకు కట్టుబడి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న డిమాండ్‌తో సెప్టెంబరు 12 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు.

అమరావతిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 60 రోజులకుపైగా కొనసాగి అరసవిల్లిలో ముగుస్తుంది. పల్లెలు, వివిధ పుణ్యక్షేత్రాల మీదుగా యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి దేశస్థానం నుంచి పాదయాత్ర మొదలుకాబోతుంది. సుమారు 60 రోజులు అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగనుంది. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలన్న ఆకాంక్షతో 44 రోజుల పాటు అడ్డంకుల్ని అధిగమించి, అణచివేతల్ని భరించి.. వర్షంలో సైతం ముందుకు సాగుతూ.. అమరావతి రైతులు ఓ ఉద్యమంలా చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్ర తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల చెంత ముగిసిన సంగతి తెలిసిందే.

SHARE