ఏపీలో దారుణం : మహిళా సర్పంచ్​పై 11 మంది అత్యాచారయత్నం

ఏపీలో దారుణాలు ఆగడం లేదు. పోలీసులు , కోర్ట్ లు ఎన్నిక శిక్షలు విధిస్తున్న కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఒంటరిగా మహిళా కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. తాజాగా మహిళా సర్పంచ్​పై 11 మంది అత్యాచారయత్నం చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

పూసపాటిరేగ మండలంలో ఓ మహిళా సర్పంచ్ ఫై 11 మంది లైంగిక దాడికి యత్నించారు. వారి నుండి తప్పించుకున్న బాధితురాలు దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం తో ఈ విషయం బయటకు వచ్చింది. తాను రేకులషెడ్డులో ఉండగా.. బుధవారం మధ్యాహ్నం పి.రమణబాబు, పి.సుధాకర్‌, పి.మధు, పి.జగదీష్‌, పి.భద్రరావు, ఎల్‌.సురేష్‌కుమార్‌, ఎ.శ్రీనివాసరావు, ఎల్‌.వెంకటరాజు, పి.ప్రసాద్‌, ఇ.సోమశేఖర్‌, పి.శ్రీనివాసరావు వచ్చి లైంగికదాడికి యత్నించారని పేర్కొన్నారు. ప్రతిఘటించే యత్నం చేయడంతో చంపాలని చూశారని పోలీసులకు తెలిపింది. మెడభాగం, పొత్తి కడుపు, ఇతర అవయవాలపై దాడిచేసి చిత్రహింసలకు గురి చేశారని ఆమె పిర్యాదు లో పేర్కొన్నారు. గట్టిగా కేకలు వేయగా.. చుట్టుపక్కల వారు రావడంతో వారు పారిపోయారని తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

SHARE