చిత్తూరు జిల్లా తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 25 మంది అధికారులు పాల్గొని.. పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. తహశీల్దార్, సర్వేయర్లు భారీ ఎత్తున భూ రికార్డులను తారుమారు చేశారని అభియోగాలు రావడంతో ఇంత పెద్ద బృందంతో ఏసీబీ అధికారులు విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి రికార్డులను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.ఇంకా చదవండి …

ఫోర్జరీ సంతకాలతో ఓ ఘరానా మోసగాడు 30 లక్షలు స్వాహా చేశాడు. ఖాతాదారుల ఫిర్యాదుతో ఈ మోసం వెలుగు చూసింది. పీలేరు ఆంధ్రా బ్యాంకు‎ అసిస్టెంట్ మేనేజర్ ‎విశ్వనాథం సొంత అవసరాల కోసం తన భార్య, స్నేహితుల పేర్లతో నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టి డబ్బులు డ్రా చేశాడు. ఖాతాదారుడు జమాల్ బాషా ఖాతా నుండి 2 లక్షలు, కృష్ణవేణి అనే మహిళా ఖాతా నుండి మూడు లక్షలుఇంకా చదవండి …

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. విద్యార్థులు, టీచర్లు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం చెలరేగింది. 15 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.ఇంకా చదవండి …

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సిదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అనేక మంచి పనులు చేపడుతుంటే చంద్రబాబు మొదట్లో తప్పుపట్టారు. కానీ ఇప్పుడు కుప్పం ప్రచారంలో ప్రతి వంద ఇళ్లకు వాలంటీర్ ను పెడతామని ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. జగన్ పథకాలను ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే కొనసాగిస్తారని అన్నారు. ఉద్యోగుల విషయంలో జగన్ అందరికీ న్యాయం చేస్తారని,ఇంకా చదవండి …